Cardless Cash Withdrawal at ATM: డెబిట్ కార్డ్ లేకున్నా.. ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా! ప్రాసెస్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to withdraw Cash from ATM Using UPI: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో జనాలు మొత్తం ఆన్‌లైన్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు. ఆన్‌లైన్ వచ్చినప్పటి నుంచి చాలా మంది డబ్బును ఇంట్లో దాచుకోవడం లేదు. అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లి లేదా డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎమ్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎమ్ నుంచి డబ్బును విత్ డ్రా చేయాలంటే.. డెబిట్ కార్డు తప్పనిసరి. అయితే మీరు డెబిట్ కార్డ్ లేకున్నా.. డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ సాయంతో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు డెబిట్ కార్డ్ మర్చిపోయినా మొబైల్ ఫోన్ సాయంతో ఏటీఎమ్ నుంచి డబ్బు తీసుకొనే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా అన్ని ఏటీఎంలలో డెబిట్ కార్డ్ లేకున్నా డబ్బులు తీసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా.. డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. అదెలాగో చుద్దాం.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఫోన్ పే, గూగుల్‌పే లాంటి యూపీఐ యాప్స్‌తో పాటు ఆయా బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఎస్‌బీఐ వినియోగదారులైతే ‘యోనో’ యాప్, ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులైతే ఐమొబైల్ యాప్‌ను ఉపయోగించొచ్చు. నెలకు ఒక లక్ష వరకు యూపీఐ ద్వారా ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. రోజువారీ విత్‌డ్రా పరిమితులు కూడా ఉంటాయి.
Also Read: Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఆంక్షలు
ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా ప్రాసెస్ (Withdrawal Money From ATM Without Card Process):
# ముందుగా ఏటీఎం యూపీఐ సదుపాయం పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆపై ఫోన్‌లో ఇంటర్నెట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
# ఏటీఎం స్క్రీన్‌పై విత్‌డ్రా సెక్షన్‌లో క్యూఆర్ క్యాష్ ఆప్షన్ ఎంచుకోవాలి. వెంటనే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దీన్ని కేవలం ఒకసారి మాత్రమే వినియోగించుకొవచ్చు.
# ఆపై మీ ఫోన్‌లో యూపీఐ యాప్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ ఆప్షన్ క్లిక్ చేసి.. ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
# ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేసి.. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. చివరగా డబ్బు విత్‌డ్రా అవుతుంది.
Also Read: Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్ రిలీజ్!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!