Mantralayam Temple: రోడ్డు ప్రమాదంలో ఆర్గనైజర్ మృతి.. దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన 500 మంది భక్తులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padayatra Organiser dies Near Mantralayam Temple: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది భక్తులకు ఆర్గనైజర్‌గా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆర్గనైజర్ మృతి చెందడంతో అతడితో వచ్చిన 500 మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం కరూర్‌కు చెందిన వీరభద్రా రెడ్డి (40) పాదయాత్ర ఆర్గనైజర్. స్వగ్రామం కరూర్ నుంచి దాదాపుగా 500 మంది భక్తులను తీసుకుని.. మంత్రాలయానికి అతడు పాదయాత్రగా వస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శివారుకు అందరూ చేరుకున్నారు. మరో అర గంటలో రాఘవేంద్ర స్వామిని దర్శనం ఉందనగా విషాదం నెలకొంది. మంత్రాలయం శివారు తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలోకి వస్తున్న ఓ ఆటో.. వీరభద్రా రెడ్డిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్గనైజర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
Also Read: Pakistan Semi Finals Chances: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?
20 సంవత్సరాలుగా వీరభద్రా రెడ్డి సోదరుడు ప్రకాశ్ రెడ్డి ఈ పాదయాత్రను నిర్వహించారు. ప్రకాశ్ రెడ్డి మరణం అనంతరం గత 8 ఏళ్లుగా వీరభద్రా రెడ్డి పాదయాత్ర బాధ్యతను తీసుకున్నారు. బుధవారం ఊహించని ప్రమాదంలో అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వీరభద్రా రెడ్డి మృతితో పాదయాత్ర భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరభద్రా రెడ్డికి భార్య జయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!