దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో ముగ్గురు నిందితులు మైనర్లు ఉన్నారన్నారు.
Atrocious: ఏపీలో దారుణం.. రెండు నెలలుగా బాలికపై వృద్ధుడు అత్యాచారం..
అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ హత్య ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా.. హత్యకు గురైన వ్యక్తిని గౌరవ్‌గా గుర్తించారు. అయితే నిందితులు, వ్యక్తి మధ్య ఏదో అంశంపై వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత అందరూ కలిసి గౌరవ్‌పై దాడి చేశారు. అనంతరం కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Article 370: ‘‘ఆర్టికల్ 370ని తీసేయలేరు’’.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్..
కాగా.. ఈ ఘటన అనంతరం ముగ్గురు నిందితులను అక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని అర్మాన్ అలియాస్ కురుగా గుర్తించగా, ఇద్దరు 17, 16 ఏళ్ల వయసున్న మైనర్లుగా తేలింది. మరో ఇద్దరు నిందితులు గౌతంపురి మైనర్ నివాసి కాగా, మరొకరు షాహిద్ గా గుర్తించి వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని చర్యలు చేపట్టారు.