Site icon NTV Telugu

LandSlide: విషాదం.. కొండచరియలు విరిగిపడి ఐదుగురు యాత్రికులు మృతి

Landslide

Landslide

LandSlide: ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. యాత్రికులు కేథార్‌నాథ్‌కు వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ఓ వ్యక్తి గుజరాత్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Read Also: BJP Leader Sana Khan: బీజేపీ నాయకురాలు సనాఖాన్‌ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తర్సాలి ప్రాంతంలోని గుప్తకాశి-గౌరీకుండ్‌ జాతీయ రహదారి సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో 60 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కేదార్‌నాథ్‌ వెళ్తున్న యాత్రికుల కారుపై అవి విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా ధ్వంసమైన కారు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది.

Also Read: Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు

ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగష్టు 11 నుంచి ఆగష్టు 24 వరకు కొన్ని జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారిపై వెళుతున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. కొండచరియలు విరిగిపడడంతో గుప్తకాశి-గౌరీకుండ్ గుండా కేదార్‌నాథ్ దామ్‌కు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version