Maharashtra: ఘోరం.. పిల్లిని రక్షించబోయి బావిలో పడి ఐదుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాడుబడిన బావిలో పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు క్షేమంగా బయటపడ్డాడు. ఈ దారుణం అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో, కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. ఆ బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కారణంతోనే ఐదుగురు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: JC Prabhakar Reddy: వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయవద్దు.. మేం అండగా ఉంటాం..
Also Read
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
పాడుబడిన బావిలో ఓ పిల్లిలో పడిపోయింది. దీంతో దాన్ని రక్షించేందుకు ఒకరు బావిలోకి దిగారు. అనంతరం ఒక్కొక్కరిగా ఇలా ఐదుగురు బావిలోకి దిగారు. తిరిగి ఒక్కరు కూడా పైకి రాలేదు. దీంతో ఐదుగురు ప్రాణాలు బావిలోనే పోయాయి. తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఒకేసారి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్‌కు తప్పిన ముప్పు.. తృటిలో బయటపడ్డ నానా పటోలే
పిల్లిని రక్షించే ప్రయత్నంలో బావిలో పడి ఐదుగురు చనిపోయారని అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. ఈ బావి బయోగ్యాస్ కోసం జంతువుల వ్యర్థాలతో నిల్వ చేయబడి ఉందని వెల్లడించారు. ఒకరినొకరు రక్షించడానికి ఆరుగురు వ్యక్తులు దిగారని.. ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడని పోలీస్ అధికారి పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్ విజయ్ మాణిక్ కాలే (35)ను క్షేమంగా రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో నివసించడానికి అత్యంత చౌకైన టాప్-10 దేశాలు ఇవే!
#WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night.
According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD
— ANI (@ANI) April 10, 2024
తాజావార్తలు
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!