Site icon NTV Telugu

Death Penalty: క్షుద్ర విద్యలొస్తాయని అనుమానంతో కుటుంబం హత్య.. ఐదుగురికి మరణదండన

Jharkhand

Jharkhand

Death Penalty: మంత్రవిద్యలో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఏడాది క్రితం జార్ఖండ్‌లో జరిగిన కుటుంబం హత్య కేసులో ఐదుగురికి స్థానిక కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. ప్రధాన జిల్లా సెషన్ జడ్జి విశ్వనాథ్ శుక్లా ఐదుగురిని దోషులుగా నిర్ధారించారు. నవంబర్ 8, 2021న పోడంగైర్ గ్రామంలో సలీం ధంగా, అతని భార్య బెళంగి, వారి కుమార్తె రహిల్‌ను గొంతు కోసి చంపినందుకు వారికి మరణశిక్ష విధించారు. ఈ గ్రామం జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని బంద్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది.

Puranapool Fire Accident: పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు

ముగ్గురు బాధితులను చంపి, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు కరో నది ఒడ్డున వారి మృతదేహాలను పాతిపెట్టినందుకు ఐదుగురికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మార్కస్ దహంగా, ఇలియాస్ దహంగా, కెంబా దహంగా, దౌద్ దహంగా, ఇలియాస్ దహంగా అలియాస్ బంకులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు మార్కస్ దహంగా తన కుమార్తె అనారోగ్యం వల్ల ప్రాణాలు కోల్పోయింది. అయితే అతని స్నేహితులు, అతని ఇరుగుపొరుగు వారు సలీం ధంగా, అతని కుటుంబ సభ్యులు చేసే చేతబడి వల్లే బాలిక చనిపోయిందని అతనికి చెప్పారు. మార్కాస్ తన సహచరులతో కలిసి ముగ్గురిని వారి ఇంట్లోనే హత్య చేసి మృతదేహాలను పాతిపెట్టాడని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ తెలిపారు. దోషులకు కోర్టు రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది.

Exit mobile version