Puranapool Fire Accident: పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Fire Accident At Hyderabad Puranapool: హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉండే ఓ గోదాములో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో, ఆరు ఫైరింజన్లను రంగంలోకి దింపారు. ఈ గోదాములో ఎక్కువగా ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో.. దట్టమైన పొగతో పాటు మంటలు కూడా ఎగసిపడుతున్నాయి. ఈ మంటల ధాటికి గోదాము పైకప్పి కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది గోదాము పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు.
Ponnam Prabhakar: నిధులిస్తానని చెప్పి కేసీఆర్ ప్రజలకు శఠగోపం పెట్టారు
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఈ ఘటనపై డీఆర్ఎఫ్ చీఫ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది మొత్తం వీల్ చైర్‌లు తయారు చేసే గోదాము అని, గోదాము చుట్టూ ఉన్న గోడలని కూల్చివేస్తున్నామని అన్నారు. ఇప్పటికే మంటల ధాటికి పైనున్న రేకులు కూలిపోయాయని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు అవ్వడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్య్కూట్ వల్ల జరిగిందా? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంటల్ని అదుపు చేసిన అనంతరం.. ఈ ఘటనకు గల కారణాలేంటన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. పైకప్పు కూలడం వల్ల మంటలు ఆర్పడం కష్టంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా.. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంటారు. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Ponguleti Srinivas Reddy: నా మామిడితోట ఎక్కడుందో చెప్పండి
కొన్నిరోజుల క్రితమే సికింద్రాబాద్‌లోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే నగరంలో నిబంధనలు పాటించని గోదాములు, భవనాలపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ పెరుగుతోంది. దాంతో.. ఇటీవల జరుగుతున్న అగ్నిప్రమాదాలపై రాష్ట్ర అగ్నిమాపక విపత్తు నివారణశాఖ సికింద్రాబాద్ కీలక కసరత్తుల దిశగా పయనిస్తోంది. భవిష్యత్తులో భారీ అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. నిమగ్నమైంది. ఇందుకోసం పోలీస్, పురపాలక శాఖల సహకారం తీసుకోని అగ్నిప్రమాదాలు అరికట్టే ప్రయత్నాలను ప్రారంభించింది.
Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!