NTV Telugu Site icon

Nepal: నేపాల్‌లో భారీగా వరదలు.. 47 మంది మృతి

Nepal

Nepal

Nepal: నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది. శుక్రవారం జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశంలో మంత్రి డోల్ ప్రసాద్‌ ఆర్యల్.. వరదల వల్ల సంభవించిన నష్టం గురించి వివరించారు. సమావేశంలో సామాజిక భద్రతా మంత్రి డోల్ ప్రసాద్ ఆర్యల్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు మొత్తం 55 వరద సంఘటనలు నమోదయ్యాయి. ఇందులో 4 మంది మరణించారు. ఒకరు వరదలో కొట్టుకుపోగా… ఇద్దరు గాయపడ్డారు, కొండచరియలు విరిగిపడటంతో 24 మంది వ్యక్తులు మరణించారు. 46 మంది గాయపడ్డారు. 36 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి, దేశంలోని 32 జిల్లాలు ప్రభావితమయ్యాయని మంత్రి తెలిపారు.

Read Also: Hathras stampede: ప్రజలపై మంది విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..

దేశంలో సెప్టెంబర్ వరకు రుతుపవనాలు
ఉప ప్రధాని, హోం మంత్రి రబీ లామిచానే తరపున మంత్రి ఆర్యల్ సమాధానమిస్తూ, నష్టం వివరాలను ఫెడరల్ పార్లమెంట్ ఎగువ సభకు తెలియజేశారు. నేపాల్‌లో రుతుపవనాల కాలం సాధారణంగా జూన్ 13న ప్రారంభమై సెప్టెంబర్ 23న ముగుస్తుంది. గత సంవత్సరం, ఇది సాధారణం కంటే ఒక రోజు ఆలస్యంగా జూన్ 14న ప్రారంభమైంది. నేపాల్‌లో వార్షిక ప్రాతిపదికన వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది చనిపోతున్నారని తెలిసిందే. ఖాట్మండు, భక్తపూర్, లలిత్‌పూర్ జిల్లాలను కలిగి ఉన్న ఖాట్మండు లోయలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి.

నేపాల్ రాజధాని ఖాట్మండులో వర్షం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆ తర్వాత ఇక్కడ వర్షం మొదలైంది. నేపాల్‌లో వచ్చే మూడు నెలల పాటు రుతుపవనాల వర్షాలు కురుస్తాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు, మురికివాడల్లో నివసించే ప్రజల ముందు అనేక రకాల సవాళ్లు తలెత్తుతున్నాయి.