NTV Telugu Site icon

Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు హతం, ఇద్దరు అరెస్ట్

Maiost

Maiost

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్ పీటీఐకి తెలిపారు.

Beenz: శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. ఎక్కడో తెలుసా?

సెర్చ్ ఆపరేషన్‌లో ఒక INSAS రైఫిల్, రెండు SLRలు, మూడు రైఫిల్స్, ఒక (9mm) పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హోంకర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన మావోయిస్టులు చైబాసాలోని తాల్కోబాద్‌కు చెందిన జోనల్ కమాండర్ కండె హోన్‌హగాగా గుర్తించామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జైగూర్ పోలీస్ స్టేషన్ ఏరియా, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవగం, మహిళా కేడర్ జుంగా పూర్తి అలియాస్ మార్లా ఉన్నట్లు తెలిపారు. సింగ్రాయ్ పై రూ. 10 లక్షలు, కాండేపై రూ. 5 లక్షలు, సూర్య పై రూ. 2 లక్షలు రివార్డు ఉంని పేర్కొన్నారు.

Pushpa 2: అనుకున్నట్టే అయింది.. డిసెంబర్ కి పుష్ప 2 వాయిదా

సింగ్రాయ్, కాండే ఐఈడీ (IED) నిపుణులు. వారు ఐఇడిలు అమర్చడం, పర్యవేక్షించడం చేస్తారని ఐజి చెప్పారు. అరెస్టయిన మావోయిస్టులలో ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బత్రీ దేవగమ్‌ ఉన్నారు. మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో.. చైబాసా పోలీసులు, కోబ్రా 209, జార్ఖండ్ జాగ్వార్ మరియు సిఆర్‌పిఎఫ్‌లతో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 5 గంటలకు బృందం ఆ ప్రాంతానికి చేరుకుని మావోయిస్టుల బృందంపై దాడి చేశారు. సుమారు గంటపాటు కాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసిన అనంతరం.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ అధునాతన ఆయుధాలతో సహా, మందుగుండు సామగ్రితో పాటు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు.