NTV Telugu Site icon

Helicopters Collide : చూస్తుండగానే ఘోరం.. గాల్లోనే ఢీ కొన్న రెండు హెలికాప్టర్లు.. పలువురి మృత్యువాత

Helicopters

Helicopters

Helicopters Collide : ఆస్ట్రేలియాలో చూస్తుండగానే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు టూరిస్ట్‌ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోల్డ్‌ కోస్ట్‌లోని సీ వరల్డ్‌ థీమ్‌ పార్క్‌ సమీపంలో గల మెయిన్‌ బీచ్‌ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

Read Also: MLA Gun Fire: డ్యాన్స్ చేస్తూ సడన్‎గా జేబు నుంచి గన్ తీసిన ఎమ్మెల్యే.. షాకైన స్థానికులు

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. టూరిస్ట్‌లను రైడ్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఈ బీచ్ క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని బ్రిస్బేన్‌కు దక్షిణంగా 45 మైళ్ల దూరంలో గోల్డ్ కోస్ట్‌లో ఉంది. ఈ ప్రాంతం దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. జనవరిలో అత్యంత రద్దీగా ఉంటుంది.

Show comments