MLA Gun Fire: డ్యాన్స్ చేస్తూ సడన్‌గా జేబు నుంచి గన్ తీసిన ఎమ్మెల్యే.. షాకైన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Gun Fire: న్యూ ఇయర్ వేడుకల్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు. వేడుకల్లో భాగంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ సడన్ గా గన్ తీసి కాల్చడం మొదలు పెట్టారు.. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారిది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Read Also: Houses are not sold : ఇకపై ఆ దేశంలో ఫారెనర్స్‌కు ఇళ్లు అమ్మరట
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
కోట్మా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి ఎక్కి డ్యాన్స్ చేసి కాసేపు ఆహుతులను అలరించారు. ఉన్నట్లుండి అందరూ చూస్తుండగానే ఆయన తన జేబు నుంచి రివాల్వర్‌ను బయటకు తీశారు. అనంతరం డ్యాన్స్ చేస్తూ గన్‌ను ఎక్కుపెట్టి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
@RahulGandhi @OfficeOfKNath @SuneelSarafINC @collectorapr @DGP_MP @ADGP_Shahdol @spanuppur1 #NewYear2023 #SuneelSaraf #MadhyaPradesh #Kotma #viral
मध्यप्रदेश : कोतमा, अनूपपुर विधानसभा से कांग्रेस विधायक सुनील सराफ का नए साल में तमंचे पर डिस्को / हर्ष फायरिंग करते वीडियो वायरल. pic.twitter.com/NfA2KiGkGr— 𝐕𝐈𝐉𝐀𝐘 𝐓𝐈𝐖𝐀𝐑𝐈 🇮🇳 (@vijaytiwarilive) January 2, 2023
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై ఇటీవల కూడా ఒక కేసు నమోదైంది. భర్త, పిల్లలతో కలిసి రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన మహిళను మద్యం మత్తులో ఉన్న ఆయన, మరో ఎమ్మెల్యేతో కలిసి లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ భర్త ట్విట్టర్ ద్వారా పోలీసుల సహాయం కోరాడు. రైల్వే పోలీసులు ఆ మహిళకు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!