Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం..
- విశాఖతో సహా, ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. విశాఖపట్నం సహా పొరుగున ఉన్న అన్ని జిల్లాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5.05 గంటల ప్రాంతంలో వైజాగ్‌లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గాజువాక, మంగళపాలెం, సాగర్ నగర్, పెద్ద వాల్తేరు, అరిలోవ, ఎంవీపీ కాలనీలతో సహా ఇతర ప్రాంతాల్లో ప్రకంపలు ప్రభావం కనిపించింది.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించినట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (భూకంప పరిశోధన కేంద్రం) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం ఉదయం 5:05:46 గంటలకు (IST) 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు బంగాళాఖాతంలోని కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంప కేంద్రం 16.805 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 84.381 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది.
Also Read
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించిట్లు సమాచారం. తక్కువ లోతులో సంభవించిన భూకంపంగా నిపుణులు దీనిని చెబుతున్నారు. భూగర్బ నిర్మాణాల్లో సర్దుబాట్ల కారణంగా ఈ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..