Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో భూ వివాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 50 ఏళ్ల వ్యక్తి, అతని కుమారుడు, మేనల్లుడు మృతి చెందారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్పీ శ్రుత్ కీర్తి సోమవంశీ తెలిపారు. ఈ ఘటన దామో దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్‌స్టార్‌ఖేడా గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు అధికారి తెలిపారు. కాగా మూడో వ్యక్తిని పదునైన ఆయుధంతో నరికి చంపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భూమి వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read Also:Railway : రాజమండ్రి మీదుగా నడిచే 26 రైళ్లు రద్దు
మృతులను హోంగార్డు జవాన్ రమేష్ విశ్వకర్మ, అతని కుమారుడు ఉమేష్ విశ్వకర్మ (23), మేనల్లుడు రవి విశ్వకర్మ (24)గా గుర్తించారు. అగ్రిమెంట్ గురించి మాట్లాడేందుకు నిందితులు హోంగార్డు జవాన్ రమేష్ విశ్వకర్మను తమ ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. అయితే అక్కడే పదునైన ఆయుధంతో హత్య చేశాడు. కొంతసేపటికి ఉమేష్, రవి కూడా హత్యకు గురయ్యారు. ఇద్దరూ బైక్‌పై దామోహ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కాల్పులు జరిపారు. గాయపడిన ఉమేష్, రవి మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం సృష్టించింది. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
Read Also:Hero Motocorp: జులై 1 నుంచి బైక్ ల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్..త్వరగా కొనేయండి..
భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గత నెలలో కూడా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు టాక్. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తెల్లవారుజామున ఇలాంటి ఘటనలతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.