NTV Telugu Site icon

BJP Manifesto: మేనిఫెస్టో కసరత్తుపై కీలక అప్‌డేట్ ఇదే!

Man

Man

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 400కు పైగా సీట్లు సాధించాలని కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీని బీజేపీ అధిష్టానం నియమించింది. ఇప్పటికే మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తోంది. పలు ఆకర్షిత పథకాలతో ముందుకు రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా పలు సూచనలు సేకరించింది.

ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు అందాయని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య తెలిపారు. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి 3 లక్షలకు పైగా సూచనలు, సలహాలు వచ్చాయని వెల్లడించారు. ఇది దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: CM YS Jagan: కదిరిలో ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న సీఎం జగన్

ప్రజల నుంచి తాము స్వీకరించిన సూచనలు, సలహాలపై ప్యానల్‌లో చర్చించి త్వరలోనే డాక్యుమెంట్‌ను ఖరారు చేస్తామని మౌర్య తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు తమకు సలహాలు, సూచనలు పంపించారన్నారు. నమో యాప్‌తో పాటు సలహాల కోసం ఏర్పాటు చేసిన నంబర్‌కు మిస్‌డ్‌కాల్‌ ఇచ్చిన వారి నుంచి సూచనలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. బీజేపీ ఏం చెబుతుందో అదే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Josh Butler: పేరు మార్చుకున్న స్టార్ క్రికెటర్.. ఇక నుంచి ఏమని పిలువాలంటే..!

సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇక, ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కన్వీనర్‌గా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కో-కన్వీనర్‌గా ఎంపికయ్యారు. మేనిఫెస్టో కమిటీలో సిక్కు, ముస్లిం, క్రిస్టియన్‌తో సహా మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి