NTV Telugu Site icon

Bihar Crime News: ద‌స‌రా ఉత్స‌వాల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురు మృతి

Untitled 3

Untitled 3

Bihar: దసరా ఉత్సవాల్లో అపశృతి దొర్లింది . పండగపూట పెను విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బీహార్ లోని రాజా ద‌ళ్ ప్రాంతంలో దేవి న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దుర్గా పూజ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం కారణంగా తొక్కసలాట నెలకొంది. ఈక్రమంలో ఓ 5 ఏళ్ళ బాలుడు తో పాటుగా ఇద్దరు మహిళలు మృతి చెందారు.

Read also:US: H-1B వీసా ప్రక్రియలో US కొత్త ప్రతిపాదనలు ఇవే ..

ఈ ఘటన పైన గోపాల్ గంజ్ ఎస్పీ స్వ‌ర్ణ ప్ర‌భాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో రాజాద‌లళ్ పూజా పండ‌ల్ గేటు దగ్గ‌ర తొక్కిస‌లాట జ‌రిగింద‌ని.. ఈ క్రమంలో ఓ 5 ఏళ్ళ బాలుడు కింద పడిపోయాడని.. ఆ చిన్నారిని రక్షించేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించగా ఆ ఇద్దరు మహిళలు కూడా కొంద పడిపోయారని.. అదే స‌మ‌యంలో భ‌క్తులు ప్ర‌సాదం కోసం బారులు తీర‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింద‌ని తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఊపిరాడ‌క అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లార‌ని.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మరణించారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించిన‌ట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో మరో 10 మంది గాయపడగా గాయపడినవారిని వారిని స‌ద‌ర్ ఆసుప‌త్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే భ‌క్తుల ర‌ద్దీని నియంత్రించేందుకు ఎలాంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేపట్ట‌కపోవడం కారణంగానే మండ‌పం వ‌ద్ద తొక్కిస‌లాట‌కు దారితీసింద‌ని పోలీసులు తెలిపారు.