US: జార్జియాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకెళ్లిన కారు.. చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీయ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రిలో చేర్పించారు.
బాధితులంతా 18 ఏళ్ల వయసు గలవారు. యువకుడితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. జార్జియాలోని అల్ఫారెట్టాలోని మాక్స్వెల్ రోడ్‌కు ఉత్తరాన వెస్ట్‌సైడ్ పార్క్‌వేలో మే 14న ఈ ప్రమాదం జరిగింది.
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
ఆల్ఫారెట్టా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలిపారు. కారు చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఐదుగురు ఉన్నారు. ఆల్ఫారెట్టా ఉన్నత పాఠశాల మరియు జార్జియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. వారిని అల్ఫారెట్టా హైస్కూల్లో సీనియర్ ఆర్యన్ జోషి, జార్జియా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీయ అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు.
గాయపడిన వారిని రిత్వాక్ సోమేపల్లిగా గుర్తించారు. ఇతడు జార్జియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి. ఇక డ్రైవింగ్ చేస్తున్న మహమ్మద్ లియాకత్.. అల్ఫారెట్టా హై స్కూల్లో సీనియర్‌గా గుర్తించారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల ఘటనా స్థలంలో మృతి చెందారు. అన్వీ శర్మ నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఇక ఏప్రిల్‌లో జరిగిన కారు ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ మృతిచెందారు.
తాజావార్తలు
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!