Site icon NTV Telugu

Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఆసియా కప్ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ ఇదే

Asia Cup

Asia Cup

ఆసియా కప్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆసియా కప్ షెడ్యూల్ వెల్లడైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యుఎఇలో జరుగనుంది. భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్‌లో జరుగనుంది. ఇది ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ కప్‌ను భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

Also Read:Srushti Test Tube Baby Center: బెజవాడలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు లింకులు.. వెలుగులోకి సంచలన విషయాలు

4 జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ Aలో భారతదేశం, పాకిస్తాన్, UAE, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ మధ్య జరుగనుంది. భారత్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న UAE తో జరుగుతుంది. రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరుగుతుంది. మూడవ మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్ తో జరుగుతుంది.

Also Read:Donald Trump: వలసలను ఆపకుంటే యూరప్ నాశనం..ట్రంప్ బిగ్ వార్నింగ్..

రాబోయే ఆసియా కప్ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. టోర్నమెంట్‌లోని ఎనిమిది జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. భారతదేశం, పాకిస్తాన్, యుఎఇ, హాంకాంగ్ గ్రూప్ ఎలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ గ్రూప్ బిలో ఉన్నాయి.

Also Read:Vishwambhara : రామ్ చరణ్‌ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..

ఇటీవల, భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను పేర్కొంటూ ఢాకాలో జరిగిన ACC సమావేశానికి హాజరు కావడానికి బీసీసీఐ నిరాకరించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. ఈ ఉద్రిక్తత కారణంగా, ఆగస్టు 2025లో ప్రతిపాదించబడిన భారతదేశం-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది.

Exit mobile version