కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్, భారత క్రికెటర్ ఇంగ్లండ్‌లో అదరగొట్టాడు. తన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. వెంకటేష్ అయ్యర్ లంకాషైర్ తరపున వన్డే గేమ్ ఆడుతున్నాడు. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌లో అయ్యర్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యర్థి జట్టు గెలవాలంటే 8 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. అయితే.. తన జట్టు సభ్యులంతా మ్యాచ్ ఓడిపోయిందని అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ మ్యాజిక్ చేశాడు.