Site icon NTV Telugu

Crime News: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్ట్

Crime News

Crime News

Crime News: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు రక్షాబంధన్‌ జరుపుకుని తిరిగి వస్తుండంగా సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అందులో ఓ బాధితురాలి కాబోయే భర్త పక్కన ఉండగానే ఈ దారుణం జరిగింది. దుండగులు అతడిని తీవ్రంగా కొట్టారు. అతడిని కొట్టి అక్కా చెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పది మంది దుండగులు వారి మార్గాన్ని బలవంతంగా అడ్డుకుని భీకరదాడికి పాల్పడడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

Also Read: Software Deepthi: దీప్తి కేసులో వీడిన మిస్టరీ.. మొత్తానికి అక్కని చంపి నచ్చినోడితో పరారైన చెల్లి..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కా చెల్లెళ్లు, యువతికి కాబోయే భర్త ముగ్గురు కలిసి తిరిగి వస్తుండగా వారిని నిందితులలో ముగ్గురు మొదట అడ్డగించారు. ఆ ముగ్గురూ నగదు, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు. మిగిలిన ఏడుగురు నిందితులు నాలుగు ద్విచక్రవాహనాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోగా నిందితులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రధాన రహదారికి దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: Manchiryala: బ్యాంకులో దొంగకు వింత అనుభవం.. ఫన్నీ లెటర్ రాసి పరార్‌

ఇద్దరు బాలికలతో పాటు వచ్చిన వ్యక్తి కూడా తీవ్ర శారీరక హింసకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు సహా పది మందిని అరెస్టు చేశారు. నిందితులలో నేర కార్యకలాపాల చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నారు, ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పూనమ్ ఠాకూర్ ఇటీవల ఆగస్టు 2023లో బెయిల్‌పై విడుదలయ్యారు. పూనమ్ ఠాకూర్ స్థానిక బీజీపీ నాయకుడు లక్ష్మీ నారాయణ్ సింగ్ కుమారుడు.

 

Exit mobile version