తుర్కియే సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు.
వలసదారులతో ప్రయాణిస్తున్న రబ్బరు పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు తుర్కియే కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. పడవలో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు.
ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గల్లంతైన వారి కోసం కోస్ట్‌గార్డ్ సిబ్బంది రెండు హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి చాలామంది తుర్కియే మీదుగా గ్రీకు, ఇటలీతో పాటు యూరప్ దేశాలకు వెళుతుంటారు. ఇటీవల కాలంలో కోస్ట్ గార్డ్ నిఘా పెరగడంతో వీరి సంఖ్య తగ్గిందని స్థానిక అధికారి తెలిపారు. గత వారం తుర్కియే సముద్రతీరంలో అక్రమంగా ప్రయాణిస్తున్న 93 మంది వలసదారులను కోస్టు గార్డు సిబ్బంది పట్టుకున్నారు.