Site icon NTV Telugu

Telangana CM: తెలంగాణలో 14 ఎంపీ సీట్లు మా టార్గెట్..

Ntv

Ntv

Revanth Reddy: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్వే పోటీ ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్యే పోరు కొనసాగనుందన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోతుంది.. ఇక, పరోక్షంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు గెలడమే మా టార్గెట్ అన్నారు. 100 రోజుల పాలనను చూసి తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39. 50 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ లోక్ సభ ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగిన లేదా తగ్గకున్నా మేం పాసైనట్లే.. రెఫరెండం అంటే అదీ అని చెప్పుకొచ్చారు. అలాగే, కేవలం 100 రోజుల్లోనే అన్నీ అయిపోవాలంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి

ఇక, ఆర్ఆర్ ట్యాక్స్ అనేవి ఉట్టి గాలి మాటలు.. నేను ఎవరికీ ఏ కాంట్రాక్టులు ఇవ్వలేదే అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అక్రమార్కులు బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోం.. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ పై అధికారులు ఇప్పటి వరకు నాకు నివేదిక ఇవ్వలేదన్నారు. నివేదిక వచ్చే వరకు నేను కూడా దీనిపై మాట్లాడటం సరికాదు.. నివేదిక వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీ వేదికగా ప్రజలకు స్పష్టంగా చెబుతాను అని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో దర్యాప్తులో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో జవాబుదారీతనం తీసుకొచ్చాం.. ప్రజాపాలనలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’ నుంచి బిగ్ అప్డేట్ వైరల్..

కాగా, రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కొందరు బీజేపీ నేతలు చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు అనే విషయాన్ని సీఎం రేవంత్ ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. బీజేపీ ఫిర్యాదు మేరకే కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా సభ్యులను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. కులగణన చేసి 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది.. కులగణను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ ప్రణాళికను మేము బయటపెట్టాం కాబట్టి.. వాళ్లంతా వివరణ ఇస్తున్నారు.. అమిత్ షాపై కామెంట్స్ చేస్తే.. కేంద్ర హోంశాఖ ఎందుకు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు. అలాగే, ఢిల్లీ పోలీసులు, లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై కేసు పెడితే.. తెలంగాణ కోసం పులినోట్లో తలకాయ పెడతానన్న వాళ్లు ఉందుకు స్పందించలేదు అని అడిగారు. నోటిసులు ఇవ్వగానే.. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరు లేరు.. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version