తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. పదో తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో బండి సంజయ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. పేపర్ లీక్ కేసులో అనుమానితుల జాబితాలో సంజయ్ కుమార్ పేరును చేర్చిన పోలీసులు, ఎఫ్‌ఐఆర్ ప్రకారం సీఆర్పీసీ 154, 157 సెక్షన్ల కింద అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం హన్మకొండ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ముందు బండి సంజయ్‌ని పోలీసులు హాజరుపరిచారు.
Also Read : Prostitution Racket: స్పా ముసుగులో పాడుపని.. 20 మందిని కాపాడిన పోలీసులు
ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత బండి సంజయ్‌ను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో సంజయ్ కుమార్‌ను ఖమ్మం జైలుకు పోలీసులు తరలించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ బిజెపి లీగల్ సెల్ ప్రతినిధులకు పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును వెల్లడించారు. పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని, తనకు గాయాలయ్యాయని చొక్కా విప్పి లాయర్లకు బండి సంజయ్ చూపించారు.
Also Read : Rajasthan Royals vs Punjab Kings: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్
