ఏదైనా తప్పు జరిగితే ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెగ రియాక్ట్ అయిపోతూ ఉంటారు జనాలు. తప్పు చేసిన వాడిని అడ్డంగా నరికేయాలి, పూడ్చిపెట్టేయాలి, వాడికి ఉరే సరి అంటూ సినిమా డైలాగులు కొడుతూ ఉంటారు. ఎవరైనా సాయం చేయకపోతే ఏం సమాజం అంటూ తెగ నీతులు మాట్లాడతారు. అయితే తీరా తమ వరకు వచ్చే సరికి చేసేది మాత్రం శూన్యం. అలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది.
Also Read: IND vs AUS 3rd ODI: మూడో వన్డేకు గిల్ దూరం.. రోహిత్ భాగస్వామి ఎవరో తెలుసా?
వివరాల్లోకి వెళితే ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, రక్తస్రావం అవుతున్న పరిస్థితుల మధ్య సాయం చేయాలంటూ నడిరోడ్డుపై తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి బతిమిలాడింది.అయితే ఎవ్వరూ కూడా ఆ బాలిక పరిస్థితి చూసి ఆదరించలేదు. పైగా చోద్యం చూసినట్లు చూశారు. ఒక వ్యక్తి అయితే ఆ బాలికను ఏదో కుక్కను తరిమినట్లు తరిమేశాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. చివరికి ఆమె ఓ ఆశ్రమానికి చేరకుంది. అక్కడ ఉన్న ఓ పూజారి ఆమె శరీరాన్ని ఓ టవల్ తో చుట్టి, ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతోనే ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.
అయితే బాలికకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఆమెకు సీరియస్ గాయాలు అయినట్టు గుర్తించిన వైద్యులు రక్తం ఎక్కించాల్సి రావడంతో ఆమెను ఇండోర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను ఈ విషయంపై ప్రశ్నించగా షాక్ లో ఉండటంతో ఆ బాలిక ఏం మాట్లాడలేకపోయినట్లు పోలీస్ చీఫ్ సచిన్ శర్మ చెప్పారు. బాలిక మాట్లాడుతున్న యాస బట్టి చూస్తే ఆ పాప ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ కు చెందినదిగా తెలుస్తుందన్నారు. నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలిక పట్ల అక్కడి వారు ప్రవర్తించిన తీరు కన్నీరు తెప్పిస్తుంది.