NTV Telugu Site icon

Krishna Crime: విషాదం.. అభం శుభం తెలియని 12ఏళ్ల బాలుడు బలవన్మరణం

Suicide

Suicide

Krishna Crime: కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలులో విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలియరాని కారణాలతో బాలుడు సాయి హర్ష ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లి ఉద్యోగ విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.

Read Also: Atrocious Incident: యువతిపై కౌన్సిలర్ అల్లుడు అత్యాచారయత్నం.. ఆమె కుటుంబంపై కత్తులతో దాడి

ఇరుగుపొరుగు వారి సహకారంతో బాలుడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే సాయి హర్ష మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణ వార్త వీన్న తల్లి శోక సముద్రంలో మునిగిపోయింది. తమ్ముడి ముందే సాయి హర్ష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. కుటుంబ కలహాలతో బాలుడి తల్లిదండ్రులు వేరువేరుగా ఉంటున్నారు. గుడివాడ వన్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.