Andhra Pradesh: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.. 11 కేవీ మెయిన్ లైన్ తీగలు కావటంతో తెగి బైక్ పై పడగానే బైక్ తో పాటు పూర్తిగా ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. విద్యార్దులు సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నట్లుగా స్థానికులు భావిస్తున్నారు. మృతులు కనిగిరి విజేత కళాశాలకు చెందిన గౌతం, బాలాజీ, నజీర్ లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే, ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నిపింది.. చేతికి అందివస్తున్న కుమారులు.. అనుకోని ప్రమాదంతో కన్నుమూయడంతో.. కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.
Read Also: TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..