11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను 11 దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఆయన ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఆక్రమించుకుంటామని చేసిన బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ దేశాలు ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడిని హెచ్చరించాయి. ట్రంప్ బెదిరింపులను ఈ దేశాలు తప్పుబట్టాయి. తాజా జరిగిన మాస్కో ఫార్మాట్ ఏడవ సమావేశంలో ఈ 11 దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
READ ALSO: Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యానికి బలైన బాలుడి.. న్యాయవాది పోరాటం
ప్రాంతీయ శాంతికి విరుద్ధం..
ఆఫ్ఘనిస్థాన్ లేదా దాని పొరుగు దేశాలలో సైనిక మౌలిక సదుపాయాలను స్థాపించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా ప్రాంతీయ శాంతికి విరుద్ధమని, దానిని సహించబోమని 11 దేశాలు పేర్కొన్నాయి. భారతదేశం, రష్యా, చైనా, ఇరాన్, పాకిస్తాన్ సహా మొత్తం 11 దేశాలు ఈ ప్రకటన విడుదల చేశాయి. బాగ్రామ్‌లో ఎటువంటి విదేశీ సైనిక స్థావరాన్ని నిర్మించనివ్వబోమని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కూడా స్పష్టం చేశారు. సెప్టెంబరులో ట్రంప్ తన ట్రూతౌట్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ.. ఆఫ్ఘనిస్థాన్ బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులను తాలిబన్లు పూర్తిగా తిరస్కరించారు.
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జకీర్ జలాల్ మాట్లాడుతూ.. “2020 ఒప్పందంలోనే దేశంలో అమెరికా సైనిక ఉనికి ఉండదని మేము స్పష్టం చేసాము” అని అన్నారు. సోమవారం రష్యా రాజధాని మాస్కోలో 11 దేశాల సమావేశం జరిగింది. భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్, చైనా, కిర్గిజ్స్తాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశానికి బెలారస్ దేశాన్ని అతిథిగా ఆహ్వానించారు. మొదటిసారిగా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం ఈ సమావేశంలో సభ్య దేశంగా పాల్గొంది. .
ట్రంప్‌కు హెచ్చరిక ఎందుకు చేశాయి అంటే..
సమావేశంలో అన్ని దేశాలు ఆఫ్ఘనిస్థాన్ స్వాతంత్ర్యం, ఐక్యత, శాంతికి మద్దతును ఇస్తున్నట్లు పునరుద్ఘాటించాయి. ఆఫ్ఘన్‌లో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను విస్తరించడం, పెట్టుబడి సహకారాన్ని పెంపొందిస్తామని వారు నొక్కిచెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ త్వరగా స్వావలంబన పొందేందుకు ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయం, విపత్తు నిర్వహణలో సహాయం కోసం వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాయి. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని వారు తాలిబన్ ప్రభుత్వానికి చెప్పారు. అలాగే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక పునరాభివృద్ధికి వాగ్దానం చేసిన వారు దానిని వెంటనే నెరవేర్చాలని ఈ 11 దేశాల ప్రతినిధులు అన్నారు. బాగ్రామ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ కల సాకారం కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Modi – Putin: పుతిన్‌తో మాట్లాడిన మోడీ.. దాని గురించేనా?