Site icon NTV Telugu

10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు

Ssc Exam

Ssc Exam

నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఎక్సామ్స్ రాయనున్నాయి. వీరిలో రెగ్యూలర్ స్టూడెంట్స్ 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి ఫెయిల్ అయిన వారు కాగా.. ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కాగా.. 98,726 మంది తెలుగు మీడియం, 7,851 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది.

Also Read : Lord Shiva Sahasranama Stotram: సోమ ప్రదోష వ్రతం వేళ ఈ స్తోత్రం వింటే చాలు శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా.. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానిక కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సహా పరీక్ష హాల్లో ఎవరూ వాడానికి కానీ.. తీసుకెళ్లేందుకు కానీ అనుమతి లేదు. పేపర్ లీగ్ చేసే అవకాశం ఉన్న ఎలాంటి పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అంతేకాదు, ఆయా పాఠశాలల కరస్పాండెట్లను కూడా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Also Read : Sri Shiva Stotra Parayanam: ఈరోజు శివ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంటిల్లిపాదికి ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి

మాస్ కాపీయింగ్ గనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, ఎంఈవోలు,డీఈవోలదే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద ఎంఈవో, డీఈవో నెంబర్లను అందరికీ కనిపించేలా రాయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక, కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ప్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని విద్యాశాఖ తెలిపింది.

Exit mobile version