Minister Satya Kumar Yadav: అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై మంత్రి ఆరా తీశారు. వైజాగ్‌లో జరుగుతున్న డీప్ టెక్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. డీప్ టెక్ కాంక్లేవ్ నుండి బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Read Also: Drugs Case: 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో వీడిన సందిగ్ధత
కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో 108 అంబులెన్స్ పైలట్ రమేష్ బాబు దుర్మరణం పాలయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మృతుని స్వగ్రామం మల్లయ్యపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాల్ని అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల్ని మంత్రి ఆదేశించారు.