NTV Telugu Site icon

Heart Attack: గుజరాత్‌కు గుండెపోటు..! 6 నెలల్లో 1,052 మంది మృతి

Heart Attack

Heart Attack

Heart Attack: అసలేం జరుగుతోంది. ఉత్సాహంతో ఉండాల్సి యువ గుండెలు అలసిపోతున్నాయెందుకు..? రెండు పదుల వయస్సు పూర్తవ్వకుండానే గుండెపోటేంటి? గుజరాత్‌లో యువకుల అకాల మరణాలేంటి..? ఇప్పుడు ఇదే దేశంలో నడుస్తున్న చర్చ. కేంద్ర ప్రభుత్వం నుంచి, పక్క రాష్ట్రాల వరకు గుజరాత్‌ పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. గుండెపోటు కారణంగా గుజరాత్‌లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్‌ ఎటాక్‌తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Read Also: Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ.. నేడు సీడబ్ల్యూసీ సమావేశం

విద్యార్థులు, యువకులకు ఊబకాయులు కూడా కాదు. హృదయ సంబంధిత కారణాలతో రోజుకు సగటున 173 కాల్స్‌ ఎమర్జెన్సీ విభాగానికి వస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువగా చిన్నవయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్రికెట్‌ ఆడుతుండగా, గార్బా నృత్యం చేస్తున్న సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ విద్యాశాఖ తెలిపింది. దీంతో టీచర్లు సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఉపాధ్యాయులందరూ భాగస్వామ్యం కావాలని సూచించింది గుజరాత్‌ ప్రభుత్వం. దాదాపు రెండు లక్షల మంది టీచర్లకు ఇవ్వనుంది. ఇందులో 2500 మంది వైద్య నిపుణులు పాల్గొంటారు. తద్వారా.. గుండెపోటు మరణాలను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Tirumala Tour: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే తిరుమల టూర్

రాష్ట్ర విద్యాశాఖ చొరవతో దాదాపు రెండు లక్షల మంది పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు డిసెంబర్ 3 నుంచి 17వ తేదీ మధ్య 37 వైద్య కళాశాలల్లో సీపీఆర్‌ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణా శిబిరాల్లో సుమారు 2,500 మంది వైద్య నిపుణులు మరియు వైద్యులు పాల్గొంటారు మరియు పాల్గొనేవారికి ధృవపత్రాలు కూడా అందించబడతాయి అంటున్నారు. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు పోలీసు సిబ్బందికి ఇటువంటి శిక్షణ ఇంతకు ముందు ఇవ్వబడిందని గుర్తుచేస్తున్నారు.