గుండెపోటు కారణంగా గుజరాత్‌లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.