Siddaramaiah:100 శాతం రిజర్వేషన్ పై విమర్శలు..బిల్లును తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం
- 100శాతం రిజర్వేషన్ తో రాష్ట్రంలో పెద్ద దుమారం
- ఈ బిల్లును పునఃపరిశీలించనున్న కర్ణాటక ప్రభుత్వం
- నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మంత్రివర్గం నిర్ణయాన్ని వాయిదా వేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంతకుముందు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ‘కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్’ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్”లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉంది. తదుపరి కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలు తమ సొంత భూమిలో సుఖంగా జీవించే అవకాశం కల్పించాలని మా ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. మేము కన్నడ అనుకూల ప్రభుత్వం. కన్నడ ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత అన్నారు.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కాగా.. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు చేసిన పోస్ట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగించారు. కర్ణాటక సర్కారు నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో సిద్ధరామయ్య తాను చేసిన పోస్టును తొలగించారు. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ రోల్స్‌లో 70 శాతం, మేనేజ్మెంట్ రోల్స్‌లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు కర్ణాటక కార్మిక శాఖ వివరణ ఇచ్చింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!