Site icon NTV Telugu

100kms Road : 100గంటల్లో 100కి.మీ రోడ్డు.. నితిన్ గడ్కారీ ప్రశంసలు

100 Kms Road,

100 Kms Road,

100kms Road : రోడ్డు వేయాలంటే చాలా టైం పడుతుంది. మట్టిపోయాలి.. కంకర వేయాలి.. తారుపోయాలి.. వాటి రోలింగ్ చేయాలి ఇలా కొన్నిరోజులు నెలల టైం పడుతుంది. కానీ 100రోజుల్లో 100కిలోమీటర్ల రోడ్డు వేసి చరిత్ర సృష్టించారు. ఇది గజియాబాద్ – అలీగడ్ ఎక్స్‌ప్రెస్ వే పై జరిగింది. 100 కిలోమీటర్ల రోడ్డును 100 గంటల్లో నిర్మించినట్టు అధికారిక ప్రకటన శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ విజయం మన దేశంలో రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు గల పట్టుదల, కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, గజియాబాద్, అలీగడ్ సెక్షన్ ఆఫ్ ఎన్‌హెచ్ 34.. సుమారు 118 కిలోమీటర్ల మేరకు ఉన్న దారి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జన సాంధ్రత అధికంగా ఉండే గజియాబాద్, అలీగడ్‌లను కలుపుతున్న ఈ రోడ్డు కీలక పాత్ర నిర్వహిస్తుందని తెలిపారు.

Read Also:RBI Guidelines: 2వేల నోట్లు రద్దు.. సామాన్యుల సందేహాలకు ఆర్బీఐ సమాధానం

ఈ హైవే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్ బుద్ధ నగర్, సికింద్రబాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతుంది. సరుకుల రవాణాకు ఈ దారి కీలకంగా ఉపయోగపడనుంది. అలాగే, ఈ రీజియన్ ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలు, సాగు ప్రాంతాలను, విద్యా సంస్థలను కలిపే ఈ దారి అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. 100 గంటల్లోనే ఈ రోడ్డును 100 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశారన్నారు. ఈ వినూత్న హరిత సాంకేతికత 90 శాతం మిల్డ్ మెటీరియల్‌ను ఉపయోగిస్తుందని అన్నారు. ఫలితంగా పది శాతం వర్జిన్ మెటీరియల్స్‌ను వినియోగితం 10 శాతానికి తగ్గుతుందని వివరించారు. ఈ విధానాన్ని ఎంచుకుని చమురు వినియోగాన్ని చాలా వరకు తగ్గించామని చెప్పారు. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని, తద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని వివరించారు.

Read Also:Fire accident: పాతబస్తీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. 2 షాపుల్లో చలరేగిన మంటలు

Exit mobile version