100kms Road : రోడ్డు వేయాలంటే చాలా టైం పడుతుంది. మట్టిపోయాలి.. కంకర వేయాలి.. తారుపోయాలి.. వాటి రోలింగ్ చేయాలి ఇలా కొన్నిరోజులు నెలల టైం పడుతుంది. కానీ 100రోజుల్లో 100కిలోమీటర్ల రోడ్డు వేసి చరిత్ర సృష్టించారు. ఇది గజియాబాద్ - అలీగడ్ ఎక్స్‌ప్రెస్ వే పై జరిగింది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీస్‌కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు కాల్స్ చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. 2024కు ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.