NTV Telugu Site icon

Indian Army: మేడ్ ఇన్ చైనా డ్రోన్లతో సరిహద్దులో పాకిస్థాన్ డర్టీ గేమ్

Bsf

Bsf

పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్‌కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ డ్రోన్లు పూర్తిగా మేడిన్ చైనా పేరుతో తయారు చేయడినవిగా గుర్తించారు. డ్రాగన్ కంట్రీలో తయారైన వీడిని వినియోగించి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు పాకిస్థానీయులు ప్రయత్నం చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి.

Read Also: Vizag Crime: బాలికపై సామూహిక అత్యాచారం.. 13 మందిపై కేసు, 11 మంది అరెస్ట్‌

అయితే, పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో 107 డ్రోన్‌లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చి వేశారని బీఎస్ఎఫ్ చెప్పుకొచ్చింది. అయితే, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ తో పాటు గుజరాత్ సరిహద్దులతో భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో 2,289 కిలో మీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. పంజాబ్ ప్రాంతం పాకిస్థాన్‌తో 553 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. కాగా, ఈ సమయంలో రాజస్థాన్ సరిహద్దు నుంచి సుమారు 10 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు.

Read Also: Myanmar Earthquake : వరుస భూకంపాలు.. వణికిపోయిన మయన్మార్.. పరుగుతీసిన ప్రజలు

ఈ డ్రోన్‌ల ద్వారా మొత్తం 442.39 కిలోల హెరాయిన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. బీఎస్ఎఫ్ సైనికులు ముగ్గురు పాకిస్థానీ చొరబాటుదారులను హతమార్చాడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లతో సహా 23 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, 35 మంది స్మగ్లర్లు సహా 14 మంది బంగ్లాదేశ్ జాతీయులతో పాటు 95 మంది భారతీయ అనుమానితులను కూడా అరెస్టు చేశారు. తెలియకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటిన దాదాపు 12 మంది పాకిస్థాన్ పౌరులను కూడా తమ దేశానికి తిరిగి పంపిచినట్లు బీఎస్ఎఫ్ పేర్కొనింది. పాకిస్తాన్‌తో సరిహద్దు భద్రతను సంరక్షించేందుకు బీఎస్ఎఫ్ పటిష్ట చర్యలు తీసుకుంటుంది.