ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్‌ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BSF Jawans Bus Incident: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) బస్సు కూలిపోవడంతో 3 మంది సైనికులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని వాటర్‌హాల్ ప్రాంతంలో కాలువలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 32 మంది జవాన్లు గాయపడగా వారిని ఆసుపత్రికి…
పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్‌కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది.