Site icon NTV Telugu

Mumbai: యువకుడి ప్రాణాలు తీసిన చికెన్ షవర్మా.. ఐదుగురికి అస్వస్థత

Chicken

Chicken

మాంసాహార ప్రియులు చికెన్‌ వంటకాలంటే లొట్టలేసుకుంటారు. చికెన్‌తో ఏం చేసినా ఇష్టంగా తింటుంటారు. అయితే ఓ చికెన్ వంటకం.. యువకుడి ప్రాణాలు తీయగా.. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. యువకుడి ప్రాణాలు పోవడానికి కారణమేంటి? అయితే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Snake Raja: వీడెవడ్రా స్వామి.. వాటిని పాములనుకున్నాడా లేక మరేమైనా అనుకున్నాడా.. వైరల్ వీడియో..

మే 13న ముంబైలో ప్రతిమేశ్ భోక్సే (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షవర్మా తిన్నాడు. తిని ఇంటికి వెళ్లగానే వారు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. మరుసటి రోజు వాంతులు ఆగకపోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ప్రతిమేశ్ భోక్సే మంగళవారం (07-05-2024) సాయంత్రం చనిపోయాడు. దీంతో పేరెంట్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యువకుడి మృతికి పాడైపోయిన చికెన్‌తో షవర్మా చేయడం కారణంగానే యువకుడి చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. అతడి స్నేహితులు మాత్రం చికిత్స పొందుతున్నారు.

ఇది కూడా చదవండి: Crime Story: వివాహేతర సంబంధాలు.. అసూయతో మహిళ కుమార్తె దారుణహత్య..

ఈ ఘటనపై ప్రతిమేశ్ భోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షవర్మా షాపు నడుపుతున్న ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. షవర్మా శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపారు. స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Rajasthan: హైవేపై ట్రక్కు యూటర్న్.. దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి

Exit mobile version