Sweeper Posts: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ఏదైనా సరే అర్హత అంతకుమించి ఉన్న కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా హర్యానా రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్య ఎలా ఉందో చెప్పేందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Nandamuri Mokshagna : జూనియర్ నటసింహం నందమూరి మోక్షజ్ఞ.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..
హర్యానా ప్రభుత్వంలో వివిధ భాగాలు కార్పొరేషన్లలో స్వీపర్ పోస్టుల కోసం ఏకంగా 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు ఉన్నట్లు సమాచారం. ఏకంగా 6000 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అలాగే 40 వేలమంది గ్రాడ్యుయేట్లు నుండి అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇకపోతే నెలసరి జీతం 15000. ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ సంస్థ అయిన హర్యానా కౌశల్ రోజ్గార్ నిగం లిమిటెడ్ సంస్థ అందించిన సమాచారం మేరకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు ఇన్ని దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.
Uttarpradesh : ఘోర ప్రమాదం.. రెండు కార్లు, ఈ రిక్షాలు ఢీ.. ఐదుగురు మృతి
ఇకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే బిజినెస్ స్టడీస్ లో డిప్లమో చేసిన వ్యక్తులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేశారంటే పరిస్థితి అర్థం పడుతుంది. పాఠశాలలో విద్యను బోధించే ఉపాధ్యాయులు కేవలం 10000 మించి కూడా ఇవ్వడం లేదని.. ముందు ముందు ఆ జీతం పెరిగే అవకాశాలు కూడా కనబడకపోవడంతో నిరుద్యోగులు ఇలా దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే స్వీపర్ ఉద్యోగం రోజంతా చేయాల్సిన అవసరం లేదని.. కాబట్టి స్వీపర్ ఉద్యోగం చేసుకుంటూ మిగతా పనులు కూడా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో చాలామంది అప్లై చేసినట్లు సమాచారం.