కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి.. వీటిలో కొన్ని వ్యాక్సిన్లు కోవిడ్ కొత్త వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.. తాజాగా కొన్ని దేశాలను డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ ఇలా కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి.. ఈ తరుణంలో.. డెల్టా వేరియంట్‌పై జైకోవ్-డీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని వెల్లడించారు జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్.. డెల్టా వేరియంట్‌పై జైకోవ్-డీ వ్యాక్సిన్ 66 శాతం ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందని తెలియజేశారు.. కాగా, జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీసీఏ) తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే, ఈ వ్యాక్సిన్ ధరపై స్పష్టత రావాల్సి ఉంది.. వచ్చేవారం ధరపై క్లారిటీ రానుండగా.. వచ్చే నెల మధ్యలో టీకాల సరఫరా ప్రారంభమవుతుందని ఆ సంస్థ చెబుతోంది.. అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ.. ప్రతీ ఏడాది దాదాపుగా 10-12 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం టార్గెట్‌గా పెట్టుకుంది.. అయితే, జైకోవ్ డీ టీకా ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. మూడు డోసుల టీకా వేయించుకోవాల్సి ఉంటుంది.. డీఎన్ఏ ఆధారిత ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీతో అభివృద్ధి చేసినందున ఈ వ్యాక్సిన్ కోవిడ్ కొత్త వేరియంట్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కుంటుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.