Site icon NTV Telugu

Jyoti Malhotra: జ్యోతి యూట్యూబ్‌‌ ఛానల్‌‌లో పహల్గామ్ వీడియోలు.. డానిష్‌తో ఎన్‌క్రిప్టెడ్ సంబంధాలు!

Jyotimalhotra

Jyotimalhotra

దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. అతడితో ఉన్న సంబంధాలతో భారత రక్షణ విషయాలు పాక్‌కు చేరవేసినట్లు గుర్తించారు.

ఇది కూడా చదవండి: IPL 2025: ఆందోళనలో కావ్య.. ట్రావిస్ హెడ్‌కు డేంజరస్ వైరస్

అయితే ఈ ఏడాదిలో రెండు సార్లు జ్యోతి పాకిస్థాన్ వెళ్లి వచ్చింది. అలాగే పలుమార్లు కాశ్మీర్‌లోని పహల్గామ్‌ను కూడా సందర్శించింది. పహల్గామ్‌లో రికార్డైన దృశ్యాలను పాకిస్థాన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడికి కొన్ని రోజుల ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు అధికారులు కనిపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డానిష్‌తో ఉన్న సంబంధాలు నేపథ్యంలో వీడియోలను ఐఎస్ఐకి అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలపైనే అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఎక్కువగా డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Nara Rohit : బాబాయ్.. ఏదేమైనా నీకు తోడుగా ఉంటా.. మనోజ్ పై నారా రోహిత్..

జ్యోతి ఎవరంటే..!
జ్యోతి మల్హాత్రా(33) హర్యానాలోని హిసార్ వాసి. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన ఆరుగురు వ్యక్తుల్లో జ్యోతి ఒకరు. శనివారం ఆమెను అరెస్ట్ చేశారు. ‘‘ట్రావెల్ విత్ జో’’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు, 132 వేల మంది అనుచరులు ఉన్నారు. ఈ ఏడాదిలో పలుమార్లు పాకిస్థాన్ వెళ్లివచ్చింది. పాక్‌కు సంబంధించిన వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 2023లో న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో సభ్యుడైన ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తిని జ్యోతి కలిసింది. డానిష్ ఆమెకు హ్యాండ్లర్‌గా మారాడు. అనంతరం పాక్ నిఘా వర్గాలను జ్యోతికి పరిచయం చేశాడు. అనంతరం ఎన్‌క్రిప్టెడ్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా ఇద్దరూ కూడా సంబంధాలు కొనసాగించినట్లుగా తెలుస్తోంది. ఇక 2023లో జ్యోతి రెండు సార్లు పాకిస్థాన్‌కు వెళ్లినట్లుగా గుర్తించారు. అక్కడ అలీ ఎహ్వాన్, షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిసింది. పాక్‌ తర్వాత ఎక్కువగా కాశ్మీర్‌లో పర్యటించినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు లోతుగా సాగుతోంది.

Exit mobile version