Youtuber: నుపుర్ శర్మను నరికేశాడు.. సారీ చెప్పాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై వీడియో తీసిన కశ్మీర్ యూట్యూబర్ ఫైసల్ వాని క్షమాపణలు చెప్పారు. నుపుర్‌ను నరికినట్లు తన వీడియోలో ఫైసల్ చూపించాడు. దాన్ని ఆన్‌లైన్‌లో అతను పోస్టు చేశాడు. మతపరమైన ఆరోపణలు చేసేవాళ్ల తల నరకడమే శిక్ష అని తన వీడియోలో యూట్యూబర్ ఫైసల్ పేర్కొన్నారు. గొడ్డలితో నుపుర్ తలను నరికినట్లు ఆ వీడియోలో గ్రాఫిక్స్ ప్రజెంట్ చేశాడు.
నుపుర్ తలను విసిరేసినట్లుగా చూపించాడు. అయితే ఈ వీడియోను పోస్టు చేసి తప్పు చేసినట్లు ఫైసల్ క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. అమాయకుడినైన నేను ఆ వివాదంలో ఇరుక్కున్నట్లు చెప్పాడు. మతపరమైన భావాలను కించపరడం తన ఉద్దేశం కాదని.. ఎందుకంటే ఇస్లాం మతం సహనాన్ని బోధిస్తుందని ఫైసల్ అన్నాడు. క్షమాపణలకు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశాడు.
బీజేపే మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు పలు నగరాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!