PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని
- మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
- వైభవ్‌కు శుభాకాంక్షలు తెల్పుతూ ప్రధాని ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్‌లు సృష్టించాడు. దేశ వ్యాప్తంగా సీనియర్ క్రికెటర్ల నుంచి, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ప్రధాని మోడీ కూడా భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..
Also Read
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2025 ఐపీఎల్‌లో మెరుపులు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతేడాది జెడ్డాలో జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు వైభవ్ వయసు కేవలం 13 సంవత్సరాలు. ఏప్రిల్ 19న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతికే సిక్స్ కొట్టి సూపర్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో మెరుపులు సృష్టించాడు. 36 సగటుతో 252 పరుగులు, 206.55 స్ట్రైక్ రేట్‌తో యశస్వి జైస్వాల్‌తో బలమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇది కూడా చదవండి: RCB-IPL 2025: ఫైనల్‌లో ఆర్‌సీబీ గెలుస్తుంది.. జోస్యం చెప్పిన మిస్టర్ 360!
ఇక ఏప్రిల్ 28న జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యా్చ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ నిలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వైభవ్ ఆట తీరుతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక మైలురాయిగా నిలిచాడు. ఇక మే 20న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎంఎస్.ధోనీ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ 33 బంతుల్లో 57 పరుగులు చేసి 2025 ఐపీఎల్ ఆటను ముగించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో వైభవ్ స్వస్థలానికి తిరిగొచ్చేశాడు. సొంత రాష్ట్రంలో ఉన్న సూర్యవంశీ.. తన తల్లిదండ్రులతో కలిసి ప్రధాని మోడీని పాట్నా ఎయిర్‌పోర్టులో కలిశాడు. ఈ సందర్భంగా వైభవ్‌ను మోడీ ప్రశంసించారు.
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
— Narendra Modi (@narendramodi) May 30, 2025
తాజావార్తలు
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!