Site icon NTV Telugu

PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని

Vaibhavsuryavanshi

Vaibhavsuryavanshi

ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్‌లు సృష్టించాడు. దేశ వ్యాప్తంగా సీనియర్ క్రికెటర్ల నుంచి, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ప్రధాని మోడీ కూడా భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2025 ఐపీఎల్‌లో మెరుపులు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతేడాది జెడ్డాలో జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు వైభవ్ వయసు కేవలం 13 సంవత్సరాలు. ఏప్రిల్ 19న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతికే సిక్స్ కొట్టి సూపర్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో మెరుపులు సృష్టించాడు. 36 సగటుతో 252 పరుగులు, 206.55 స్ట్రైక్ రేట్‌తో యశస్వి జైస్వాల్‌తో బలమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇది కూడా చదవండి: RCB-IPL 2025: ఫైనల్‌లో ఆర్‌సీబీ గెలుస్తుంది.. జోస్యం చెప్పిన మిస్టర్ 360!

ఇక ఏప్రిల్ 28న జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యా్చ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ నిలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వైభవ్ ఆట తీరుతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక మైలురాయిగా నిలిచాడు. ఇక మే 20న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎంఎస్.ధోనీ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ 33 బంతుల్లో 57 పరుగులు చేసి 2025 ఐపీఎల్ ఆటను ముగించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో వైభవ్ స్వస్థలానికి తిరిగొచ్చేశాడు. సొంత రాష్ట్రంలో ఉన్న సూర్యవంశీ.. తన తల్లిదండ్రులతో కలిసి ప్రధాని మోడీని పాట్నా ఎయిర్‌పోర్టులో కలిశాడు. ఈ సందర్భంగా వైభవ్‌ను మోడీ ప్రశంసించారు.

 

Exit mobile version