NTV Telugu Site icon

IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

Rainalert

Rainalert

దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. తమిళనాడులో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, విరుదునగర్, తిరునల్వేలి, కన్యాకుమారి, శివగంగ, కృష్ణగిరి, రామనాథపురం, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుంది. 35-45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు కెమరూన్ ప్రాంతం చుట్టూ గాలులు గంటకు 55 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు.. వచ్చే 48 గంటల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 17న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Shocking Video: భర్త చనిపోయిన బెడ్‌ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..

ఇక దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు హెచ్చు, తగ్గులుగా ఉన్నాయి. దోయాబ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. గత 24 గంటల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ దోబ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని ఎండీ తెలిపింది.

ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితుల కారణంగా డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్, ఇన్‌ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు విస్తరిస్తున్నాయి. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు తమ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ