NTV Telugu Site icon

Gujarat: కంత్రీ ఖైదీ.. మొబైల్ ఎక్కడ దాచాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

G

G

జైలు అంటే కట్టుదిట్టమైన భద్రత. నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. బయట వారిని లోపలికి పంపించరు. చాలా పగడ్బందీగా జైలు పరిసరాలు ఉంటాయి. అలాంటిది ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన తీరు చూసి మరింత అవాక్కయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జైల్లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: West Bengal: 61 రోజుల్లో నిందితుడికి మరణశిక్ష.. బాలిక హత్యాచారం కేసులో సంచలనం..

రవి బరయ్య(33) అనే ఖైదీ పోక్సో కేసులో అక్టోబర్ 19, 2024 నుంచి గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా జైల్లో ఉంటున్నాడు. జైలు లోపల మొబైల్ వాడకం ఉండదు. డిసెంబర్ 4న (గురువారం) సాయంత్రం స్థానిక దర్యాప్తు బృందం జైలు ఆవరణలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో జైలు సర్కిల్ సెక్షన్‌లో మొబైల్ ఫోన్ ఛార్జర్‌ని గుర్తించారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. మొబైల్ ఛార్జర్ ఎలా వచ్చిందని ఖైదీలను ఆరా తీశారు. కానీ ఎవరు నుంచి సమాధానం దొరకలేదు. అయితే రవి బరయ్యపై అనుమానం వచ్చింది. కానీ అతడి వస్తువులను పరిశీలించినా ఎక్కడ ఆనవాళ్లు దొరకలేదు. అయినా అతడిపై అనుమానం తగ్గలేదు.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌-రే తీయించారు. స్కానింగ్‌లో మల ద్వారంలో మొబైల్‌ ఉన్నట్లుగా బయటపడింది. దీంతో ఎక్స్‌-రేను చూసి అధికారులు షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Volkswagen Cars: కారు కొనేవారికి శుభవార్త.. ఈ కారుపై భారీ తగ్గింపు ధరలు

ఈ ఘటనపై భావ్‌నగర్ జిల్లా జైలు ఇంచార్జ్ జైలర్ విష్ణుజీ వాఘేలా నీలం బాగ్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 223 మరియు ఖైదీల చట్టంలోని సెక్షన్ 42, 43, మరియు 45(12)లను ఉదహరించారు. వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం స్థానిక దర్యాప్తు బృందం జైలు ఆవరణలో సోదాలు నిర్వహించారని.. సెర్చ్‌లో జైలు సర్కిల్ సెక్షన్‌లో మొబైల్ ఫోన్ ఛార్జర్‌ని గుర్తించినట్లు తెలిపారు. బ్యారక్‌లోని ఖైదీలందరినీ విచారించగా రవి బరయ్య తీరు అనుమానాలకు తావించిందన్నారు. క్షుణ్ణంగా పరిశీలించినా ఎటువంటి నిషిద్ధ వస్తువులు దొరకలేదన్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు జైలు అధికారులు బారయ్య పురీషనాళంలో ఏదో దాచి ఉండొచ్చని అనుమానించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల నిమిత్తం బారయ్యను భావ్‌నగర్‌లోని సర్తీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో నిర్వహించిన ఎక్స్-రేలో అతని మల కుహరంలో మొబైల్ ఫోన్ దాగి ఉన్నట్లు బయటపడింది. అనంతరం ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మొబైల్ ఫోన్, ఛార్జర్ జైలులోకి ఎలా వచ్చింది. బారయ్య ఎంతకాలంగా ఫోన్ ఉపయోగిస్తున్నాడు అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.

ఇది కూడా చదవండి: Pragya Nagra leaked Video: టాలీవుడ్ హీరోయిన్ వీడియోలు లీక్