Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా గెలిచినా వదిలిపెట్టేది లేదు: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ కూడా ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మొత్తం కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఓ మహిళ కిడ్నాప్ కేసులో నిన్న జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను రప్పించేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఇంటర్ పోల్ నుంచి ‘బ్లూ కార్నర్ నోటీసు’ కోరే అవకాశం ఉంది.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆర్ అశోక్, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్ బీజేపీ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపించదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గం నుంచి జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గెలిచినా ఆయనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజ్వల్ తప్పించుకోవడానికి సీఎం సాయం చేశాడని అశోక ఆరోపించారు. హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లుగా సిద్ధరామయ్య హసన్‌లో ప్రజ్వల్‌కి ఎందుకు మద్దతిచ్చారని అడిగారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకుని 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేశాయి. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ మిత్రపక్షంగా ఉంది. కర్ణాటకలో మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకుంటే ప్రజ్వల్ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకుంటామని అశోక అన్నారు. ఇటీవల హసన్ జిల్లా వ్యాప్తంగా ప్రజ్వల్‌కి సంబంధించిన సెక్స్ టేపులు వైరల్ అయ్యాయి. అయితే, ఇవి మార్ఫింగ్ వీడియోలు అని ప్రజ్వల్ తన పోలింగ్ ఏజెంట్ ద్వారా ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!