డ్రాగన్ కంట్రీకి ఆర్మీ చీఫ్ వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె… సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు ఇటీవల సైనిక అధికారుల స్థాయి 14వ విడత చర్చలు కూడా జరిగాయన్నారు..
మరోవైపు.. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ ఇంకా ప్రయత్నాలు సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఎం నరవణె. బోర్డర్ దగ్గర కశ్మీర్లోకి చొరబడేందుకు 300-400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు… కాగా, భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన జవాళ్ల మధ్య ఘర్షణ.. అందులో ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్లు అమరులైన తర్వాత.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఎప్పటికప్పుడూ.. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు, సరిహద్దుల్లో ఆక్రమణలు, అక్రమంగా కట్టడాల నిర్మాణానికి ఎప్పటికప్పుడూ చైనా ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!