Wonder Akarshana: 9 ఏళ్ల ఏజ్ నుంచే లైబ్రరీలు.. ప్రధాని మోడీనే చేతుల మీదుగా 25వ లైబ్రరీ..
- 9 ఏళ్లకే మొదలైన లైబ్రరీ ఉద్యమం
- కరోనా సమయంలో పుట్టిన ఆకర్షణ ఆలోచన
- 24 లైబ్రరీలు, 16 వేల పుస్తకాల సేవ
- 25వ లైబ్రరీ ప్రారంభానికి ప్రధాని మోదీ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wonder Akarshana: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే లోకాన్నే మర్చిపోయే నేటి తరం పిల్లలకు భిన్నంగా, పుస్తకాలను కాపాడుకుంటూ వందలాది మందికి జ్ఞానాన్ని పంచుతోంది ఆకర్షణ. గల్లీలో మొదలైన ఆమె చిన్న ఆలోచన, నేడు ఢిల్లీ పీఠాన్ని కదిలించే స్థాయికి ఎదిగింది. కేవలం ఐదేళ్ల కాలంలో 24 లైబ్రరీలను ఏర్పాటు చేసి, వేలాది పుస్తకాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఈ చిన్నారి ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
ఆకర్షణ ఆలోచన వెనుక ఒక హృదయ విదారకమైన సంఘటన ఉంది. కరోనా సమయంలో క్యాన్సర్ పేషెంట్ల ఇబ్బందులను చూసి చలించిన ఆ చిన్నారి, తన దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలను వారికి ఇచ్చి ఆనందాన్ని పంచాలని నిర్ణయించుకుంది. వారు ఆ పుస్తకాలు చదువుతూ పొందిన ఉపశమనం చూసి, పుస్తకాలకు ఉన్న శక్తిని ఆమె అర్థం చేసుకుంది. అలా 9 ఏళ్ల వయసులోనే ‘ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ’ స్థాపనకు శ్రీకారం చుట్టింది.
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
మొదట్లో చిన్నగా ప్రారంభమైన ఈ ప్రస్థానం ఐదేళ్లలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 24 లైబ్రరీలను ఆకర్షణ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సుమారు 16,000 పుస్తకాలను విద్యార్థులకు, సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. కేవలం లైబ్రరీలు పెట్టడమే కాకుండా, ప్రజల నుంచి పుస్తకాలను సేకరించి వాటిని అవసరమైన చోటుకి చేర్చడంలో ఆమె చేస్తున్న కృషి అనన్యం.
ఆకర్షణ చేస్తున్న ఈ నిశబ్ద విప్లవం దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆమె అంకితభావాన్ని మెచ్చిన ప్రధాని, ఆమెకు ప్రత్యేక ప్రశంసలు అందించారు. తన 25వ లైబ్రరీని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని ఆకర్షణ కోరగా, దానికి మోదీ సానుకూలంగా స్పందించి వస్తానని మాట ఇచ్చారు. దీంతో ఢిల్లీలో మొదటిసారిగా తన లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు ఆకర్షణ టీమ్ భారీగా ప్లాన్ చేస్తోంది.
చిన్న వయసులోనే 100కు పైగా అవార్డులు అందుకున్న ఆకర్షణకు భారత రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మంత్రుల నుండి ప్రశంసలు దక్కాయి. పుస్తకాలపై ఇంత మక్కువ ఉన్న ఈ చిన్నారికి భవిష్యత్తులో స్పేస్ సైంటిస్ట్ (అంతరిక్ష శాస్త్రవేత్త) అవ్వాలన్నది పెద్ద కల. విజ్ఞాన శాస్త్రంలో కొత్త విషయాలను కనుగొనాలని, మన దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
Double Bedroom: తెలంగాణలో వారి డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దయ్యే అవకాశం.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!