Women Reservation Law: అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
- అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు
- ఓటింగ్ జరగకముందే న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ
- దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 18 గంటల చర్చ తర్వాత శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కానీ ఇంతలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్లులపై పార్లమెంట్‌లో తీవ్ర వాగ్యుద్ధం నడుస్తున్న తరుణంలోనే కేంద్ర న్యాయ శాఖ సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్ధరాత్రి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది.
మహిళా రిజర్వేషన్ చట్టం-2023 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగం (106వ సవరణ) చట్టం-2023లోని నిబంధనలు ఏప్రిల్ 16, 2026 నుంచి అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే న్యాయ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఓటింగ్ నిర్వహించకుండానే నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని చర్చ సాగుతోంది.
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ఇదిలా ఉంటే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై అర్ధరాత్రి వరకు తీవ్రంగా చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం- 2023 గురువారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఒక అధికారి మాత్రం ‘‘సాంకేతిక కారణాలు’’ కావొచ్చని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం లోక్‌సభలోని మహిళలకు తక్షణ ప్రయోజనం ఏమీ ఉండదని.. తదుపరి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయబడతాయని అధికారి చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!