Site icon NTV Telugu

Delhi fire: ఢిల్లీలో దారుణం.. మహిళను కాల్చి చంపిన దుండగుడు

Delhifire

Delhifire

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భర్త, పిల్లలతో బైక్‌పై వెళ్తున్న మహిళపై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఛాతీలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3:15 గంటలకు గోకుల్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. హీరా సింగ్ అనే వ్యక్తి.. తన భార్య సిమ్రంజీత్ కౌర్(25).. ఇద్దరు పిల్లలతో మౌజ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Kerala Floods: అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి

ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో సిమ్రంజీత్ కౌర్ తన భర్తతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా.. మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టి వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఇంతలో తుపాకీ తీసుకుని కాల్పులు జరపగా.. సిమ్రంజీత్ కౌర్ ఛాతీలోకి బుల్లెట్ దిగి ప్రాణాలు వదిలింది. ఇద్దరు పిల్లలతో కలిసి మౌజ్‌పూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితురాలి భర్త తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Israel: కేవలం 12 గంటల్లోనే.. ఇజ్రాయిల్ ఇద్దరు శత్రువుల హత్య..

Exit mobile version