దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబల బలైపోతుంది. తాజాగా తమిళనాడులో మరో ఘోరం జరిగింది. బైక్ టాక్సీపై వెళ్తున్న మహిళను అమాంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బైక్ వదిలేసి పరారైపోయాడు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: ‘‘అందమైన వ్యక్తి.. చాలా కఠినుడు’’ దక్షిణ కొరియా టూర్‌లో మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
చెన్నైలోని పక్కికరణైలో ఉన్న ఫ్రెండ్‌ను కలిసేందుకు 22 ఏళ్ల మహిళ సోమవారం రాత్రి బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని డ్రైవర్ శివకుమార్‌ను కోరింది. దీంతో మంగళవారం ఉదయమే మహిళను బైక్ ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తుండగా నిర్మానుష్య ప్రాంతం రాగానే బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేసి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని భర్తకు తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Droupadi Murmu: ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం
దీంతో బాధిత మహిళ, భర్త కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా విచారణలో అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో నిందితుడు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. మంగళవారం నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల ఆరోపణలను రాష్ట్ర పోలీసులు, డీఎంకే నేతలు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
